కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్,శ్రీశైలం నిండుకుండలా మారాయి. ఎగువ శ్రీశైలం వైపు నుంచి 4,10,978 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,68,630 క్యూసెక్కులను స్పిల్ వే ద్వారా నదిలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండింది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల నుంచి 5,19,713 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 10 క్రస్టుగేట్లను 25 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు 5,95,775 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8070) టీఎంసీలు కాగా ప్రస్తుతం 884.20 అడుగులు (210.99) టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.