నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నామినేషన్లపర్వం మంగళవారంతో ముగియనుంది.టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాగా, వీరితోపాటు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరుస సెలవులు రావడం, 30న చివరి గడువు కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేష్లకు ఏర్పాట్లు చేసుకున్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఉదయం 11గంటలకు నామినేషన్ వేయనుండగా, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3గంటల మధ్య బీజేపీ అభ్యర్థి రవినాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 12 గంటలకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సమర్పించనున్నారు.
ఇప్పటి వరకు సాగర్ ఉప ఎన్నికకు మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3న ఉపసంహరణ కాగా, ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. కాగా, ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతీ అంశాన్ని సీరియ్‌సగా తీసుకొని పనిచేస్తున్నాయి. నామినేషన్లపర్వం ము గియగానే ఈ నెల 31 నుంచి ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నారు.