నాగార్జున సాగర్‌..

5
- Advertisement -

భారీ వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో రేపు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

మరోవైపు కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 9.8 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి ఉభయ నదులు.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 5,25,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Also Read:తెలంగాణ కేబినెట్ భేటీ..

- Advertisement -