నాగార్జునసాగర్ 12 గేట్లు ఎత్తివేత‌..

247
Nagarjuna Sagar Dam

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉద్రితి పెరిగింది. సాగర్ కి ఎగువనుండి భారీగా నీరు చేరడంతో 12 గేట్లను 10 ఫీట్లా మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఎన్‌ఎస్‌పీ అధికారులు.

నీటి మట్టం ఈవిధంగా..

-ఇన్ ఫ్లో : 2,13,034 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో : 2,13,034 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులు.