సాగర్‌లో కారు జోరు..

18
nomula

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుండి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న టీఆర్ఎస్… ఐదో రౌండ్ ముగిసే సరికి 4334 ఓట్ల‌ ఆధిక్యతతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు.

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు ,మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి.పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది.