జానారెడ్డికి జాక్‌పాటా…ఇవే చివరి ఎన్నికలా..!

150
jana
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఈ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడు, పెద్దలు జానారెడ్డి 11వ సారి ఎన్నికల్లో తలపడుతుండగా టీఆర్ఎస్ తరపున నోముల భగత్, బీజేపీ తరపున రవికుమార్ బరిలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనగా ఈ ఎన్నికల తర్వాత జానారెడ్డి భవిష్యత్ ఏంటనే దానిపై హస్తం పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే టీపీసీసీలో భారీ మార్పులుంటాయని టాక్ నడుస్తోంది. ఒకవేళ జానా గెలిస్తే ఆయనే పీసీసీ చీఫ్‌గా నియమితులు కానున్నారని టాక్ నడుస్తుండగా 2023 ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను జానారెడ్డికి అప్పగించి, ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళతారనే చర్చ నడుస్తోంది.

జానారెడ్డి అయితే పార్టీలో చాలా సీనియర్‌. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా పనిచేశారు. పార్టీలో ఏ స్థాయి నేతలనైనా సమన్వయం చేసుకునే సామర్థ్యం జానాకు ఉందని కొంతమంది నేతలు చెబుతున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు జానా ఓడిపోతే ఇవే ఆయనకు చివరి ఎన్నికలు కానున్నాయని మరికొంతమంది నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం జానా వయస్సు 76. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి 8 పదులు దాటే అవకాశం ఉండటంతో ఒకవేళ ఒడిపోతే ఇవే లాస్ట్ ఎన్నికలు కానున్నాయని భావిస్తున్నారు. మొత్తంగా నాగార్జున సాగర్ ఎన్నికలు పెద్దలు జానారెడ్డి భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -