సాగర్‌లో కమలం వాడిపోవడం ఖాయం..5శాతం ఓట్లు కూడా రావట..!

88
bandi

నాగార్జున సాగర్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు చోట్ల సాధించిన ఘన విజయంతో గులాబీ శ్రేణులు విజయోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇదే ఊపులో సాగర్‌‌లో కూడా మరోసారి గులాబీ జెండా ఎగరవేసి రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎదురులేదని చాటాలని సీఎం కేసీఆర్ ఫిక్స్ అయ్యారు.

ఇక నాగార్జుసాగన్ ఉప ఎన్నిక బీజేపీకి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సిసలైన పరీక్షగా మిగలనుంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవడం, పార్టీలో అంతర్గత విభేదాలతో కాషాయ పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్ధానాన్ని కొల్పోవడం,మరో స్ధానంలో నాలుగో స్ధానంలో నిలవడంతో బండి నాయకత్వానికి సవాల్‌గా మారింది.

ఎందుకంటే నాగార్జున సాగర్‌లో బీజేపీకి పేరు మోసిన నేతలెవరూ లేరు. దుబ్బాకలో గెలిచినంత ఈజీగా.. హైదరాబాద్‌లో కారు ఢీకొట్టినంత అలవోకగా.. సాగర్‌ ఎన్నికలు ఉండబోవు. అందుకే టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో పాటు ఇంటర్నల్‌గా నిర్వహించిన సర్వేలో కమలం పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతంతో బండి సంజయ్ దిమ్మతిరిగిందట. కేవలం 5 శాతం ఓటర్లు మాత్రమే బీజేపీకి మద్దతిస్తుండగా మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్‌ వైపే ఉన్నారట.

మొత్తంగా సాగర్ ఉప ఎన్నికలు బండి నాయకత్వానికి సవాల్‌గా మారాయి. ఇప్పటివరకు బండి నాయకత్వంతో ఏదో ఒరుగుతుందని ఆశలు పెట్టుకున్న కమలం క్యాడర్‌కు ఈ ఎన్నికలతో పూర్తి క్లారిటీ రానుంది.