రెడీ….స్టార్ట్…యాక్షన్‌!

162
ts
- Advertisement -

ఇదేదో సినిమా షూటింగ్ కాదు…నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పార్టీ అభ్యర్ధి వేస్తున్న ఫీట్. సాగర్ బీజేపీ అభ్యర్ధిగా చివరి నిమిషంలో బీ ఫామ్ దక్కించుకున్న డాక్టర్ రవికుమార్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అంతగా స్పందన రావడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా పెద్దగా ప్రచారంలో కనిపించడం లేదు.

అయితే రవికుమార్ మాత్రం ప్రచారం చేస్తూ ముందుకుసాగుతుండగా కాస్త డిఫరెంట్‌గా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఓట్ల కోసం కాళ్లు పట్టుకోవడం,తాయిలాలు ఇవ్వడం,చిన్న పిల్లలను బుజ్జగించడం వంటివి చూసుంటాం. అయితే రవికుమార్ మాత్రం ఓటర్ కనబడగానే కంటతడి పెడుతూ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో రవికుమార్ ఎందుకు ఏడుస్తున్నారో తెలియక ప్రజలు అక్కడినుండి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిపాజిట్ దక్కడం సంగతి పక్కన పెడితే రవికుమార్‌కు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -