శ్రీశైలం 8,సాగర్ 6 గేట్లు ఎత్తివేత

213
nagarjuna sagar
- Advertisement -

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంకు 2,10,420 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా ఎనిమిది గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,52,639 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీరుంది

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 1,33,350 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,33,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 309.6546 టీఎంసీల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులకు వరకు నీరుంది.

- Advertisement -