- Advertisement -
భారీ వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర, 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 3.83,170 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,15,483 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,34,176 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది.
ఇక ఇవాళ అల్పపీనడం ప్రభావంతో కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలు
- Advertisement -

