- Advertisement -
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఈ క్రమంలో మొత్తం 26 గేట్లను ఎత్తగా, అందులో 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర, మరో 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, దిగువకు 2,09,632 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 585.10 అడుగులుగా ఉండగా ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,54,519 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 296.7235 టీఎంసీలుగా ఉంది.
ప్రాజెక్టుకు చేరిన నీటితో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది.
Also Read:పీఎం కిసాన్ 20వ విడత నిధులు రిలీజ్
- Advertisement -

