నాగ్ హీరోగా వర్మ యాక్షన్ మూవీ..

169
Nagarjuna - Ram Gopal Varma's
- Advertisement -

రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. వర్మ ఏది చేసినా అది సంచలనమే. అయితే రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో కొన్ని ఆదిలోనే ఆగిపోతే మరికొన్ని మాత్రం పట్టాలెక్కేస్తూ ఉంటాడు.ఇప్పుడు నాగార్జున హీరోగా తాను మరో సినిమాను తెరకెక్కించనున్నట్టు తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

Nagarjuna - Ram Gopal Varma's "SHIVA-2" soon

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ అప్పట్లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ సినిమా వచ్చి పాతికేళ్లకు పైగా అవుతుండగా, మళ్లీ ఇంతకాలానికి నాగార్జునతో చేయడానికి వర్మ సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఇది ‘శివ’ సినిమాకి సీక్వెల్ కాదు .. అంతకి మించిన డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని వర్మ అన్నాడు. వాస్తవానికి దగ్గరగా వుండే యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని అన్నాడు.

- Advertisement -