ఓంకార్‌ కోసం గెటప్ మారుస్తాడా..?

252
Nagarjuna new look for Omkar
Nagarjuna new look for Omkar
- Advertisement -

రాజుగారి గదికి సీక్వెల్ గా ఓంకార్ దర్శకత్వంలో `రాజుగారి గది2` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఆ హారర్ థ్రిల్లర్ కథని ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్నిపివిపి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అందులో నాగార్జున ఎలా కనిపించబోతున్నాడన్న విషయం ఆసక్తికరంగా మారింది.

akkineni-nagarjuna-first-look-from-om-namo-venkatesaya-revealed

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ …నా కెరీర్‌లో `మ‌నం` ఓ ట‌ర్న్. త‌ర్వాత `ఊపిరి`, `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాలో స‌క్సెస్ కొట్టాను. నెక్ట్స్ ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న‌ప్పుడు `ఓం న‌మో వేంక‌టేశాయ` సినిమా అవ‌కాశం రావ‌డం, అందులో న‌టించ‌డం జరిగింది. త‌ర్వాత ఏ సినిమా చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో ఓంకార్ ద‌గ్గ‌ర ఓ మంచి క‌థ ఉంద‌ని నిరంజ‌న్‌, పివిపిగారు న‌న్ను క‌లిసి క‌థ విన‌మ‌న్నారు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఉంటేనే చేస్తాన‌ని వారితో అన్నాను. క‌థ విన‌గానే బాగా న‌చ్చింది. నాకు ఇష్ట‌మైన థ్రిల్లర్ జోన‌ర్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ‌లో నేను న‌టించ‌లేదని అన్నారు.

oopir

ఇటీవల కాలంలో నాగార్జున చేస్తున్న ప్రతి సినిమాలోనూ ఓ కొత్త రకమైన గెటప్ కనిపిస్తోంది. అందుకే మీడియా జనాలు కూడా ఉండబట్టలేక నాగ్ ని తన క్యారెక్టర్ గెటప్ గురించి అడిగారు. ఇప్పటికే డిఫరెంట్‌ గెటప్‌లతో వస్తున్న నాగ్‌.. ఈ సినిమాలో తన గెటప్ కొత్తగా ఉంటుందన్నారు. `కుర్రాళ్లయితే ఇప్పుడు గెడ్డాలతో కనిపిస్తున్నారు. మరి నేనెలా కనిపించాలన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఓంకార్ మాత్రం కొన్ని స్కెచ్చులేసి పెట్టాడు“ అన్నారు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు నాగ్ ని ఈ సినిమాలో గుండుతో చూపించాలని ఓంకార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి నాగ్ అందుకు ఒప్పుకుంటాడా? అన్నది చూడాలి. కథ నచ్చిందంటే నాగ్ కూడా ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఊపిరిలో వీల్ చైర్ కే పరిమితమైన పాత్రని చేసిన విషయం తెలిసిందే. కథ – పాత్రలు బాగుంటే అభిమానులకి నచ్చుతుందో లేదో అని కూడా పెద్దగా ఆలోచించరు నాగార్జున.

- Advertisement -