అక్కినేని కొత్త లగ్జరీ కారు రేటెంతో తెలుసా…

301
Nagarjuna new car

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని కొత్త కారు కాన్నారు. అది కూడా తన 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆ కారును కొన్నారట. దాదాపు రూ.1.87 కోట్లు పెట్టి బీఎండబ్ల్యూ కారు కొన్నారు. రాజసం ఉట్టిపడేలా లగ్జరీ కార్లను తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ కంపెనీ కారును నాగార్జున తన జన్మదిన సందర్భంగా కొనుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ బీఎండబ్ల్యూ 7 సిరీస్ 750 ఎల్ ఐఎక్స్ డ్రైవ్ స్పోర్ట్స్ (2016) మోడల్ కు చెందిన కారులో అన్నీ ప్రత్యేకతలేనట.

Nagarjuna new car

బ్లూ కలర్ లో మెరిసిపోతున్న ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నాగ్… నేటి ఉదయం ఖైరతాబాదులోని ఆర్డీఏ కార్యాలయానికి స్వయంగా వచ్చారు. రిజిస్ట్రేషన్ లో భాగంగా కౌంటర్ వద్ద ఫొటో దిగిన నాగ్… నిబంధనల మేరకు డిజిటల్ సంతకం కూడా చేశారు. నాగ్ కారుకు ఆర్టీఏ అధికారులు *టీఎస్09ఈక్యూ9669* నెంబరును కేటాయించారు. కారులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సౌకర్యాలు ఉండగా ఇంటీరియర్ మొత్తం లగ్జరీకి కేరాఫ్ అడ్రెస్ లా ఉందట. రిమోట్ కంట్రోల్ తో ఈ కారునను పార్కు చేసుకునే వెసులుబాటు ఉందట.

Nagarjuna new car

బీఎండబ్ల్యూ టచ్ కమాండ్ సిస్టమ్ – వైర్ లెస్ చార్జింగ్ తదితర సౌకర్యాలు కూడా ఈ కారు సొంతమట. ఈ కారు 445 హెచ్ పీ సామర్ధ్యం గలది. 4.4 లీటరు టర్బో చార్జ్ డ్ పెట్రోలు వి 8 ఇంజన్ దీని ప్రత్యేకత. ఈ కారు బాడీ అల్యూమినియంతో పాటు కార్బన్ ఫైబర్ రీఎన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఇక కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన నాగ్ ను చూసేందుకు జనం ఎగబడ్డారట. నాగ్ తో సెల్ఫీల కోసం పోటీలు పడ్డారట. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.