- Advertisement -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు కింగ్ నాగార్జున. గతేడాది నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగచైతన్య – శోభితా పెళ్లి జరుగగా తాజాగా చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు.
ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా.. జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున ఉప ముఖ్యమంత్రి భట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందజేశారు నాగార్జున.
Also Read:TTD:దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లు మార్పు
- Advertisement -

