- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సినీ నటుడు నాగార్జున. తన కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబుకు వివాహ పత్రిక అందజేశారు.
గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరు జూన్ 6న పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టేడియోలోనే సింపుల్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అఖిల్…కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read:ఉస్తాద్ భగత్‌సింగ్..సాలిడ్ అప్‌డేట్!
- Advertisement -

