నాగ్‌ తో దిల్‌రాజు మూవీ..?

219
Nagarjuna latest movie Srinivasa kalyanam ?
- Advertisement -

ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి.  ఒక వైపున యూత్ ను, మరో వైపున మాస్ ఆడియన్స్ ను ఆకర్షించే విధంగా కథలు ఉండేలా చూసుకుంటారు. ఆ దారిలో వెళ్తున్నందుకేనేమో దిల్‌రాజు విజయాల బాటలో ఉన్నాడు.

అయితే అటు యూత్ ని , ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ ని కూడా అలరించించే సినిమాలు చేసిన దిల్‌ రాజు ఇప్పడు మళ్ళీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ ని కూడా టార్గెట్‌ చేసినట్టున్నాడు. అందుకే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే సినిమాలు చేయడంలోను ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ తరహాలో వచ్చిన సినిమాలే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ .. ‘శతమానం భవతి’. ఈ సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణపోందాయో తెలిసిందే.

అయితే తాజాగా దిల్‌ రాజు ‘శ్రీనివాస కల్యాణం’ అనే సినిమాకి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్‌ ని దిల్‌రాజు రిజిస్టర్‌ కూడా చేయించారు. ఈ సినిమాకు ‘శతమానం భవతి’ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్నను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు దిల్‌ రాజు. అందుకే ఈ సినిమా కథ నాగ్‌ కాదనలేని విధంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు.  మరి నాగ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని, సంక్రాంతి బరిలో దిగుతాడో లేదో చూడాలి.

- Advertisement -