నాగ్…నిజంగా మన్మథుడే!

67
- Advertisement -

సరికొత్త డ్యాన్స్‌ షోకు వేదికైంది స్టార్ మా. బిగ్ బాస్ జోడి డ్యాన్స్ రియాల్టీ షో ప్రారంభం కాగా ఈ షోకి హోస్ట్‌గా శ్రీముఖి , అలనాటి నటి రాధ, తరుణ్ మాస్టర్, సదా జడ్జీలుగా వ్యవహరించనున్నారు. స్టార్ మాలో ప్రతీ శనివారం – ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కింగ్ నాగార్జున.

బిగ్ బాస్ జోడి తొలి ఎపిసోడ్‌లో హైలైట్‌గా మారారు మన్మధుడు నాగార్జున. తన పేరుకు తగ్గట్టుగానే నిజంగానే మన్మథుడు అనిపించుకున్నారు. వేదికపై శ్రీముఖి, తేజస్విని, ఫైమాలకు కిస్‌ ఇచ్చి మరింత జోష్ తెచ్చారు. తొలుత రాధతో డ్యాన్స్ చేశారు నాగ్. ఒకప్పుడు రాధ పేరు వినగానే డ్యాన్స్ గుర్తుకొచ్చేది. చిరంజీవితో పోటీ పడి మరి స్టెప్పులేసింది రాధ. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే హీరోలు భయపడిపోయేవారు. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు నాగ్. తర్వాత విక్కీదాదా సినిమాలోని పాటకు నాగ్‌తో కలిసి డ్యాన్స్‌ చేశారు రాధ.

ఇక ఫైమాకు చేతిపై కిస్ ఇస్తే తెగ సిగ్గుపడిపోతుంది. ఈ విషయాన్ని తెలిసి బిగ్ బాస్ లో ఫైమా ఎలిమినేట్ అయిన సందర్భంగా ఆమె చేతిపై కిస్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయగా తాజాగా బిగ్ బాస్ జోడి స్టేజ్ పై కూడా ఫైమా చేతికి కిస్ ఇచ్చి హుషారు నింపారు. షోలో భాగంగా అవినాష్ – అరియానా జోడిగా రాగా వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. తర్వాత అరియానాతో నాకు జోడీ ఏంటి అని అవినాష్ అనగా నాగార్జున నువ్వు వెళ్లి పో అవినాష్‌…అరియానాతో నేను జోడిగా ఉంటా అని మరింత హైప్ క్రియేట్ చేశారు. మొత్తంగా వయసు మీద పడుతున్న నాగార్జునలోని రొమాంటిక్ యాంగిల్ ఏ మాత్రం తగ్గలేదని ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్లు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -