ఓటు హక్కు వినియోగించుకున్న నాగ్…

1746
nagarjuna

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకోగా తాజాగా అక్కినేని నాగార్జున‌, ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు.

మంచు ల‌క్ష్మీ ఫిలిం న‌గ‌ర్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. న‌గ‌ర ప్ర‌జ‌లు బాధ్య‌త‌గా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని ఆయ‌న అన్నారు.