నాగ్ ‘బంగార్రాజు’లో ర‌మ్య‌కృష్ణ‌..

779
nag ramyakrishna
- Advertisement -
అక్కినేని హీరో కింగ్ నాగార్జున టాలీవుడ్ లో యువ హీరోల‌కు ధీటుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయ‌న కెరీర్లో చెప్పుకోద‌గిన సినిమాల్లో ఒక‌టి సోగ్గాడే చిన్నినాయ‌నా. ఈమూవీలో ద్వీపాత్రాభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈసినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతోపాటు ఆయ‌న‌కు మంచి పేరును తీసుకువ‌చ్చింది. ఈసినిమాలో ఆయ‌న పోషించిన బంగార్రాజు క్యారెక్ట‌ర్ కు అద్బుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈసినిమాలో నాగార్జునకు జంట‌గా ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి న‌టించారు. యువ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
soggade chiniinayana
 ఈసినిమాకు సిక్వేల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట నాగార్జున. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌కు క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ని స‌మాచారం. ఆ తరువాత కొద్ది రోజుల‌కు  కల్యాణ్ కృష్ణ కథ చెప్పడం .. నాగ్ మార్పులు చెప్పడం జరుగుతూ వచ్చింది. అలా ఇద్దరూ కలిసి కథను ఒక కొలిక్కి తెచ్చేశారట.. ఈమూవీలో కూడా నాగ్ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణను క‌న్ఫామ్ చేసిన‌ట్టు  స‌మాచారం. ఈమూవీలో నాగార్జునతో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌నున్నార‌ట‌. చైతూకు జోడిగా ఎవ‌రిని తీసుకుంటార‌నేదానిపై ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు చిత్ర‌యూనిట్. త్వ‌ర‌లోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి.
- Advertisement -