సంవ‌త్స‌రం ఫోన్ వాడ‌కుంటే రూ.72ల‌క్ష‌లు..

235
Ditch Your Smartphone and Get $100K
- Advertisement -

ప్ర‌స్తుత రోజుల్లో అన్నం లేకుండా ఒక గంట‌సేపు అయినా ఉంటారేమో కానీ మొబైల్ లేకుండా మాత్రం అస్స‌లు ఉండ‌రూ అని చెప్పుకోవ‌చ్చు. చిన్న పిల్ల‌ల నుంచి పెద్దల వ‌ర‌కూ స్మార్ట్ ఫోన్ లోనే ప్ర‌పంచం మొత్తం చుట్టేస్తున్నారు. మొబైల్ వాడ‌కుండా ఒక సంవ‌త్స‌రం పాటు ఉంటే దాదాపు రూ.72ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఓ అమెరికా కంపెనీ చెబుతోంది. 72ల‌క్ష‌లు కావాల‌నుకున్న వారు 365రోజుల పాటు ఫోన్ ను వాడ‌కూడ‌ద‌ని ష‌ర‌తులు విధిస్తోంది. కోకాకోలా కంపెనీ అనుబంధ సంస్థ విటమిన్‌ వాటర్‌ ‘no phone for a year’ పేరిట ఈ పోటీని నిర్వహిస్తోంది.

VitaminWater
ఇందులో పోటీ పడేందుకు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విటర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ల ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మొద‌టగా పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్‌ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను ఈ పోటీలో భాగంగా వాడుకునే వెసులుబాటును కూడా క‌ల్పించారు ఆసంస్ధ యాజ‌మానులు. అయితే పోటీలో పాల్గొని చివరిదాకా కొనసాగలేని వారి కోసం విటమిన్ వాటర్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. కనీసం 6 నెలల పాటు ఫోన్ వాడకపోయినా రూ.7 లక్షలను ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. ఎంత‌మంది ఈపోటీలొ పాల్గోని 72ల‌క్ష‌లు ఎవ‌రూ గెలుస్తారో చూడాలి.

- Advertisement -