మరోసారి నాగార్జున సరసన అనుష్క..

622
Anushka-nagarjuna
- Advertisement -

అందాల భామ అనుష్క భాగమతి చిత్రం తర్వాత ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కెరీర్ తొలి నాళ్ళలో గ్లామర్ పాత్రలు చేసిన అనుష్క ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు ఎక్కువగా చేస్తుంది. ఆమె నటించిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇటివలే మరో లేడి ఓరియంటేడ్ సినిమాకు సైన్ చేసింది ఈ భామ. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కింగ్ నాగార్జున కోన వెంకట్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈచిత్రానికి ప్రముఖ హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీకి మన్మధుడు2 అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

Nagarjuna Anushka

అయితే ఈసినిమాలో నాగార్జున సరసన ఆర్ఎక్స్ 100హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించనుంది. మరో ముఖ్య పాత్రలో అనుష్క ను తీసుకున్నట్లు తెలుస్తుంది. నాగార్జున సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అనుష్క. ఈచిత్రంలో అనుష్కను నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో ఆ తర్వాత కూడా నాగార్జునతో పలు సినిమాల్లో నటించింది. నాగార్జునకు అనుష్క లక్కీ హీరోయిన్ గా మారిపోవడంతో ఆయన ప్రతి సినిమాలో అనుష్కకు చిన్న పాత్ర అయిన ఉంటుంది.

 nagarjuna Rahul Ravindran

త‌న‌ని ఎంత‌గానో ప్రోత్స‌హించిన నాగ్‌పై ఉన్న అభిమానం కార‌ణంగానే ఆయ‌న సినిమాల‌లో గెస్ట్ పాత్ర‌ల‌కైన ఒకే అంటుంది ఈభామ. పోర్చుగ‌ల్‌లో చిత్ర తొలి షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. కథ ప్రకారం ఈచిత్ర షూటింగ్ చాలా వరకూ విదేశాలలోనే జరగనుందట. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈసినిమాలో అనుష్క నటిస్తుందా లేదా అనే అంశంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేవరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -