కేటీఆర్ ట్వీట్‌కు స్పందన….

94
K Tarakarama Rao

చేనేతకు చేయూతనిచ్చేందుకు చేనేత, జౌళి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. చేనేతకు పూర్వవైభవం తెచ్చేందుకు జాతీయ స్ధాయిలో కృషిచేస్తున్న కేటీఆర్….ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అందరికి చేప్పే ముందు స్వయంగా పాటించాలని నిర్ణయించుకున్న కేటీఆర్…ఇటీవలే చేనేత వస్త్రాలను ధరించి సచివాలయంలోని కార్యాలయానికి వచ్చారు. ఇక అంతేగాదు ప్రజాప్రతినిధులందరికీ చేనేత వస్త్రాలను అందించిన కేటీఆర్….చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషిచేయాలని కోరారు.

Nagarjuna And Amala wears HANDLOOM CLOTHES

అయితే ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ సెలబ్రిటీలకు ట్విట్టర్‌ ద్వారా చేనేత వస్త్రాలు మీరు ధరించడానికి సిద్ధమా అంటూ ఇటీవలే ట్విట్‌ చేసి సెలబ్రిటీలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. అందులో నాగార్జున కూడా ఒకరు. తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల కలిసి చేనేత వస్త్రాలు ధరించి
ఫోటో దిగారు దాన్ని ట్విట్టర్‌లో పొస్ట్‌ చేశారు. చేనేత వస్త్రాలు చాలా నచ్చాయని.. అందంగా ఉండటమే కాదు.. సౌకర్యవంతంగా కూడా ఉన్నాయని.. తాను చేనేత రంగానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు నాగార్జున. తన మాటకు స్పందించిన నాగ్ కు కేటీఆర్ ట్వీట్ తో థ్యాంక్స్ చెప్పేశారు. అంతేకాదు.. నాగ్.. అమల జంట ఫోటో పలువురికి స్ఫూర్తిని రగిలిస్తుందన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు కేటీఆర్‌.