ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన……

284
free eye screening camp ranga reddydist
- Advertisement -

రంగా రెడ్డి జిల్లా మంచాల మండ‌ల‌ కేంద్రంలో విదేశాల‌లో స్థిర‌ప‌డిన జంభులవిలాస్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఉచిత కంటి ప‌రిక్ష శిబిరం, క్యాన్స‌ర్ అవ‌గాహ‌న స‌ద‌స్సు ను ఇబ్ర‌హీంప‌ట్నం ఏమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి, ఏమ్మేల్సి రాంచంద‌ర్ రావులు ప్రారంభించ‌గా అపూర్వ స్పందన ల‌బించింది. ఈ క్యాంపుకు కంటికోసం 680 రాగా 300 మందికి ప‌రిక్ష‌లు నిర్వ‌హించి మందుల పంపిణిచెయ‌డం జ‌రిగింది. 60 మందికి అద్దాలు ఉచితంగా పంపిణిచేయ‌డం జ‌రిగింది. క్యాన్స‌ర్ అవ‌గాహ‌న స‌ద‌స్సు,నిర్ధార‌ణ ప‌రిక్ష‌ల‌కు 350 మందిని ప‌రిశీలించారు. క్యాన్స‌ర్ వ్యాధి విష‌యంలో తీసుకోవ‌ల్సిన జాగ్ర‌త్త‌లు నిష్ణాతులైన వైద్య బృందంచే సూచ‌న‌లు అందించ‌డం జ‌రిగింది.

free eye screening camp ranga reddydist

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅథిదిగా హాజ‌రైన ఇబ్ర‌హీంప‌ట్నం ఏమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ….. విదేశాల‌లో స్థిర‌ప‌డిన మ‌న ప్రాంతంవారు విలాస్ రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. విధేశాల‌లో ఉంటూ విడిది కోసం వ‌చ్చి కోద్ది స‌మ‌యంలోకూడా ఉచిత క్యాంపు ఏర్పాటు చేయించ‌డం అభినంద‌నీయమ‌ని తెలిపారు. అదేవిధముగా పక్కా బిల్డింగ్స్ ని కట్టడం కోసం ఏమ్మేల్సి రాంచంద‌ర్ రావు గారి తో రాజకీయాల అతితతముగా ప్రజలకు సేవ చేస్తున్నాం అని తెలిపారు , రవాణా వ్యవస్థను , పక్కా గృహాల కోసం మరియు పలు అభివ్రిద్ది పనులని వివరించారు , తాను స్థాపించిన ఎంకెఆర్ ఫౌండేషన్ ద్వారా వేల మందికి పోలీస్ ఉద్యోగాల శిక్షణ ఇప్పించి , ఉద్యోగాలు వచ్చే విధముగా కృషి చేసాం అన్నారు , అమెరికాలో చాలా మంది ఎన్ఆర్ఐ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని తెలిపారు , ఎన్ఆర్ఐలు అందరూ కలిసి విద్య ఉపాధి ప్రతి ఒక్క గ్రామానికి అందేలా చూడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లో వ్యాపార రంగం లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఫార్మా రంగం అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతుందని అందుకు తెలంగాణ ప్రభుత్వం , కేసీఆర్‌ ౩౩౦౦౦ ఎకరాల భూమి కేటాయించారని తెలిపారు.

free eye screening camp ranga reddydist

ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ఠ అతిదిగా హాజ‌రైన ఏమ్మేల్సి రాంచంద‌ర్ రావు మాట్లాడుతూ….. ఈ మెడికల్ క్యాంపుల‌ను స‌ద్వినియోగంచేసుకోవాల‌ని, గ్రామాల‌లో వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ప్ర‌శంస‌నీయమ‌ని ఆయ‌న తెలిపారు. గౌరవ ఏమ్మెల్యే మంచి రెడ్డి కిసాన్ రెడ్డి గారితో కలిసి పని చేయడం, ఈ నియోజక వర్గం లోని అభివృద్ధి ని పొగిడారు. నరేంద్ర మోడీ కూడా స్వచ్ఛ భారత్ ద్వారా పరిసరాలు , ఆరోగ్యం జాగ్రత్ర్త ఉంచుకోవడం ముఖ్యమని తెలిపారు .ఎంపీపీ జయమ్మ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా జరగాలని , తమ వంతు సహాయం కూడా చేస్తామన్నారు. గ్రామ సర్పంచ్ ప్రమీలమ్మ మాట్లాడుతూ , విలాసరెడ్డి మంచాల గ్రామానికి చెందినవారు కావడం మాకు ఎంతో సంతోషం ను కలుగచేస్తుంది అని తెలిపారు .

free eye screening camp ranga reddydist

ఏక్క‌డ ఉన్నా పుట్టిన ఊరిగురించే ఆలోచించే వ్య‌క్తి విలాస్ గార‌ని నెహ్రూయువ‌కేంద్ర సంఘ‌ట‌న్ జాతీయ ఉపాధ్య‌క్షులు పేరాల చంద్ర‌శేఖ‌ర్జీ సభ ముగింపు కార్యక్రమంలో తెలిపారు. ఇలాంటి మెడికల్ క్యాంపు ల వల్ల పేద ప్రజలకు చాల ఉపయోగం అని తెలిపారు .

free eye screening camp ranga reddydist

ఈ క్యాంపులో ఓంకోటెల్లిజెంట్, య‌శోద ఆసుప‌త్రి వైద్యులు సుజాత‌, అర‌వింద్ రావు, ప్ర‌వీన్ , సుస్మ, అఫిఫా , ఆర్ పి అప్టిక‌ల్స్‌ ర‌చ్చ‌పాండు & పీస్ వెల్ఫేర్ సొసైటీ వైధ్యులు శ్రీనివాస్ రావు, అబ్బాస్ లు వైద్య‌స‌హాయంచేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గోపాల్ రావు , ఇబ్ర‌హీంప‌ట్నం మ‌ర్కెట్ క‌మిటీ చైర్మెన్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, క‌మిటీ డైరెక్టర్ జంబుల కిషన్ రెడ్డి , దందటి రవి ఇబ్ర‌హీంప‌ట్నం నుండి కొత్త అశోక్ గౌడ్ , ముత్యాల భాస్కర్ , ఇండియా సెన్సార్ బోర్డ్ మెంబెర్ ప్రతాప్ , బొక్క నర్సింహా రెడ్డి మండల అధ్య‌క్షురాలు జ‌య‌మ్మ‌, గ్రామ‌స‌ర్పంచ్ ప్ర‌మీల‌, ఉప సర్పంచ్ వెంకేటేష్ గౌడ్, నారెడ్డి నరసింహ రెడ్డి , టీచర్ నరసింహ, ప్రైమరీ హెడ్ మాస్టర్ సుదర్శన్ , హై స్కూల్ హెడ్ మాస్టర్ జనార్దన్ రెడ్డి , హరీష్ , మల్గ శ్రీశైలం , రాజేందర్ రెడ్డి , ఏంపిటీసీ కిష్ట‌మ్మ, బుస్సు పుల్లారెడ్డి , అనిరెడ్డి జగన్ రెడ్డి , సత్తారి పాండు చిందేం రఘపతి, ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ పార్టీల నాయ‌కులు, వీ ఫ‌ర్ ఎడ్యుకేట్ బృందం స‌బ్యులు జంబుల రామచంద్ర రెడ్డి , వర్కాల వెంకట్ రెడ్డి , గోగిరెడ్డి మోహన్ , గడ్డం రవీందర్, సరస్వతి ఫౌండేషన్ చైర్మన్ సదా వెంకటరెడ్డి త‌దిత‌రులు పాల్గోన్నారు.

- Advertisement -