బిగ్ బాస్ లోకి నాగార్జున..

233
nagarjuna nani
- Advertisement -

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణతో ప్రముఖ హీరో నాని హోస్ట్‌గా బిగ్‌బాస్‌ 2 సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువులకు వేదికైంది. గొడవలు, టాస్క్‌లు, ఏడుపులు, ఎలిమినేషన్స్‌తో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి రేటింగ్‌తో సక్సెస్‌పుల్‌గా రన్‌ అవుతోంది బిగ్‌ బాస్‌ షో. ఇప్పటికే ఈ షోలో ఎంతో మంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు. తమ సినిమా ప్రమోషన్స్‌తో పాటు షోల ప్రమోషన్స్‌ కోసం సెలెబ్రిటీలు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లారు. తాజాగా అక్కినేని నాగార్జున ఇటీవల నటించిన దేవదాస్‌ సినిమా ప్రమోషన్స్‌ కోసం బిగ్‌బాస్‌ హౌజ్‌ గడప తొక్కాడు. నాగార్జున ఈరోజు ప్రసారమయ్యే బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌లో కనిపించనున్నారు.

nagarjuna nani

ఇప్పటికే నాగ్‌ సందడి చేసిన ఎపిసోడ్‌ ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ ప్రోమోలో నాగార్జున చెప్పిన మా దాస్‌ని ఎవ‌రో ఇబ్బంది పెడుతున్నార‌ట‌. గ‌న్‌లో క‌రెక్ట్‌గా ఆరు బుల్లెట్స్ ఉన్నాయ‌ని నాగ్ చెబుతున్న డైలాగ్స్‌ ఆద్యంతం ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో భాగంగానే ఈ సినిమా యూనిట్‌ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచింది. దీంతో నాగార్జున సినిమా ప్రమోషన్‌ కోసం బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేస్తూ కనిపించాడని తెలుస్తోంది. ఈ సినిమా పుల్‌ కామెడీ ఎంటర్‌టైన్‌ జోన్‌లో సాగినట్టు తెలుస్తోంది.

దేవ పాత్రలో నాగార్జున, దాస్‌ పాత్రలో నానిలు సరికొత్త లుక్‌తో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రష్మీక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -