సమంతను చూసి నేర్చుకోండి…చైతూ, అఖిల్ కు నాగ్ క్లాస్

610
Nagarjuna Akhil nagacjhitanya.jpeg
- Advertisement -

అక్కినేని నాగార్జున యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు ఆయన నటించిన సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు2 సినిమాలో నటిస్తున్నాడు. నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేసినా ఒక్కటి కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈసినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక నాగచైతన్య ఇటివలే మజీలి సినిమా విజయంతో కాస్త టెన్షన్ నుంచి బయటపడ్డాడని చెప్పుకోవాలి. ఆయనకు కూడా ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ లు లేవని చెప్పుకోవాలి. ఇటివలే నాగర్జున తన కొడుకులు ఇద్దరికి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా రంగంలో రాణించాలని అనుకునే వాళ్ళు కూడా సమయాన్ని ఫాలో అవుతుంటారు. ఈ విషయంలో నాగార్జున సమయాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంటాడు.

అందుకే నటుడిగా ఇప్పటికి సినీ రంగంలో నిలబడ్డాడు. ఇదే విషయంపై చైతూ, ఆఖిల్ కు క్లాస్ తీసుకున్నాడట. షూటింగ్ సమయానికి 20 లేదా 15 నిమిషాల ముందే సెట్స్ లో ఉండి ఆరోజు తీయబోయే సీన్ గురించి ఆలోచించాలని, సీన్ ప్రిపరేషన్ చర్చించుకునే సమయం దొరుకుంటుందని నాగ్ చైతుకు, అఖిల్ కు చెప్పినట్టు తెలుస్తోంది. సీన్ ను అర్ధం చేసుకుంటే మంచి నటుడిగా ఎదుగుతామని చెప్పారట నాగార్జున.

- Advertisement -