ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని… కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు అన్నారు. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు.
ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు.
అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసి నాగార్జున ఎన్-కన్వెన్షన్ హాల్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారించిన హైడ్రా…ఇవాళ ఉదయం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టింది.
Also Read:Telangana BJP: తెలంగాణ బీజేపీలో అదే గందరగోళం