ఎపీలో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయిన తరుణంలో నామినేషన్‌ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వారి అస్తుల అప్పులు వివరాలు ప్రకటిస్తున్నారు. ఈ సందర్బంగా నటి,నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా ఈనెల 22న నగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోటి రూపాయలు విలువ చేసే ఏడు కార్లను చూపించారు.
దీన్ని బట్టి చూస్తే ఆమెకు కార్లు అంటే ఎంత మక్కువో ఇట్టే అర్థమవుతుంది. ఆ వాహనాలకు సంబంధించి ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. మహీంద్రా, ఫోర్డ్ ఇండీవర్, చావర్‌లెట్, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్, హూండా స్ల్పెండర్, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ కార్ల విలువ రూ.1,08,16,564లుగా చూపించారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు రోజా రూ.52,63,291లు చెల్లించారు.
ఇక రోజా ఆస్తుల మెుత్తం రూ.7,38,38, 430లుగా అఫిడవిట్‌లో పొందుపరిచారు. అయితే ఆమె భర్త సెల్వమణి పేరిట మాత్రం స్థిరాస్థి లేదని స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000 అయితే 2017-18 సంవత్సరానికి గానూ సెల్వమణి చెల్లించిన ఆదాయపు పన్ను రూ.3,94,518 రూపాయలుగా అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇక ఆమె కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అనూషల పేర్ల మీద రూ.50,56,191 డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
రోజా పేరిట ఉన్న ఆస్తుల వివరాలు:
రోజా పేరిట ఉన్న మొత్తం ఆస్తి: రూ.7,38,38,430
స్థిరాస్తి మొత్తం : రూ.4,64,20,669
చరాస్తి మొత్తం : రూ. 2,74,17,761
అప్పులు : రూ.49,85,026