టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది కాబట్టి, ఈ సినిమా పొంగల్ కి రాదు అని, కచ్చితంగా సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగార్జున – దర్శకుడు విజయ్ బిన్నీ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాయట.
కేవలం, నా సామిరంగ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సంక్రాంతికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేయొచ్చు. మరియు సోగ్గాడే సెంటిమెంట్ ఎలాగో ఉంది. ఈ రెండింటి కారణంగా ‘నా సామిరంగ’ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు నాగ్.
ఆ సెంటిమెంట్ కోసమే నాగార్జున ఆదివారాలు కూడా డేట్స్ ఇస్తున్నాడట. అలాగే, రాత్రుళ్ళు కూడా షూటింగ్ కి ఒకే అంటున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు.
అతి త్వరలోనే ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే, ‘నా సామిరంగ’ ఫస్ట్ సింగిల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు రీసెంట్‌గా యానిమల్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించిన త్రిప్తి ద్రిమి ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి.
Also Read:సీఎం రేవంత్‌కు హరీశ్ రావు విషెస్