బీఆర్ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి

66
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి. తనకు నాగం జనార్ధన్‌ రెడ్డి మంచి మిత్రుడన్నారు. 1969 ఉద్యమంలో నాగం జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారన్నారు. గతంలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్‌ పార్టీలోకి రావడం సంతోష్ంగా ఉందన్నారు. సామాన్యుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి పీజేఆర్ అని…ఆయన ఇవాళ పార్టీలో రావడం ఆనందంగా ఉందన్నారు. విష్ణు వర్ధన్‌ రెడ్డికి రాజకీయ భవిష్యత్‌ బాధ్యత తనదేనన్నారు. కరీంనగర్ జిల్లా నుండి బీజేపీలో చేరిన జయపాల్ రెడ్డికి స్వాగతం పలికారు.

నాగం జనార్ధాన్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పాలమూరులో 14కి 14 బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. విష్ణు చేరికతో పార్టీ మరింత బలోపేతం అయిందని జూబ్లీహిల్స్‌లో మంచి మెజార్టీ వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక మంచి ప్రగతి సాధించామన్నారు. రాజకీయాల్లో దాడులు సరైంది కాదన్నారు. భగవంతుడి దయతో ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు కాపాడిన భగవంతుడికి ధన్య వాదాలు తెలిపారు.

Also Read:పిక్ టాక్ : వామిక సొగసుల జాతర

- Advertisement -