- Advertisement -
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా ఉదయం నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో ఓటర్లు చేరారు.
మేఘాలయలో సోహియాంగ్‌లో నియోజకవర్గ యూడీపీ (UDP) అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదాపడింది. ఇక నాగాలాండ్‌లోని అకులుటో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
- Advertisement -