విరాట‌ప‌ర్వం నుండి …”న‌గాదారిలో” సాంగ్

158
virataparvam
- Advertisement -

విరాట‌ప‌ర్వం చిత్రం నుంచి ‘న‌గాదారిలో’ పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. స‌న‌పాటి భ‌రద్వాజ్,ద్యావ‌రి న‌రేంద‌ర్ రెడ్డి సాహిత్యం అందించిన ఈ పాట‌ను వ‌రం ఆల‌పించారు. సురేష్ బొబ్బిలి స్వ‌ర ప‌రిచిన ఈ పాట సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ పాట సాహిత్యం మరియు జానపద అల్లిక ఆకట్టుకుంటుంది.

రానా అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ 2021 మొదటి బాగంలో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికి, క‌రోనా మహమ్మారి వలన విడుద‌లకు నోచుకోలేదు. పాత్ర కు న్యాయం చేయ‌డానికి తన పూర్తి స్కిల్స్ ని శక్తి వంచన లేకుండా ఉపయోగించే అతికొద్ది మంది న‌టుల‌లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. మొద‌టి నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సినీరంగంలో త‌న కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు రానా ద‌గ్గుబాటి. ఉత్త‌ర తెలంగాణ‌లో 1990లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా వేణు ఊడుగుల విరాట‌ప‌ర్వం చిత్రాన్ని తెర‌కెక్కించారు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రాన్ని శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు.

ఈ చిత్రం జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుందని విరాట‌ప‌ర్వం చిత్ర‌బృందం ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ‘నీదినాది ఓకేక‌థ’ ఫేం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

- Advertisement -