‘వెంకీమామ’ ఫస్ట్ లుక్ అదుర్స్..

330
venkymama movie first look
- Advertisement -

విక్టరీ వెంకటేశ్ ఈమధ్య మల్టీస్టారర్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ఇటివలే ఆయన నటించిన ఎఫ్ 2చిత్రం ఘన విజాయన్ని సాధించిన విషయం తెలిసిందే. వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఈమూవీ తర్వాత మరో మల్టీస్టరర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ. ఈసారి తన అల్లుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నాడు. ఈసినిమా పేరు వెంకీమామ.

కొద్ది రోజుల క్రితమ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈమూవీ ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో వెంకటేశ్, నాగ చైగన్య ఇద్దరు ధాన్యం బస్తాలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. అంతేకాకుండా పోస్టర్‌లో ఉన్న బైక్‌పై ‘జై జవాన్.. జై కిసాన్’ అనే టైటిల్ కనిపిస్తోంది.

ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్ , కోన ఫిల్మ్ కార్పోరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా పండుగ సెలవుల్లో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -