హే చైతూ.. ఏమిటి ఈ షాకింగ్ చేంజ్ ?

149
- Advertisement -

అక్కినేని నాగచైతన్య లుక్, బిహేవియర్ చాలా డీసెంట్ గా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఐతే, తాజాగా వెన్నులో వణుకు పుట్టించే లుక్ లోకి చైతు మారిపోయాడు. ఈ మాస్ లుక్ లో చైతుని చూసి నెటిజన్లు సర్ ప్రైజ్ ఫీల్ అవుతూ వరుస కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ, ఈ లుక్ ఏ సినిమా కోసం అంటే.. నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే చైతు పై విధంగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రాబోతుంది.

ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా మానాడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వెంకట్ ప్రభు నుంచి వస్తోన్న సినిమా ఇది. అన్నిటికీ మించి.. మేకర్స్ తాజగా రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రీ-లుక్‌ అందర్నీ థ్రిల్ చేసింది. ఈ క్రేజీ పోస్టర్‌లో పోలీస్ గెటప్ లో కనిపిస్తోన్న నాగచైతన్య చుట్టూ పోలీస్ గ్యాంగ్ ఆవేశంగా గుంపుగా దాడి చేసినట్టు ఉంది. మొత్తానికి ఈ పోస్టర్ లో చైతు తన లుక్ తో ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాడు. ముఖ్యంగా చైతు యాక్షన్ లుక్ ఆ రేంజ్ లో వైల్డ్ గా హైలైట్ గా నిలిచింది.

పోస్టర్ బ్యాగ్రౌండ్ లో చైతు తల వెనుక ఉన్న మనుషుల సెటప్ అండ్ గెటప్స్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పైగా పోలీస్ ఫార్మల్ సూట్ లో నాగచైతన్య చాలా క్రూరంగా చూస్తూ కనిపించడంతో… టుడే మూవీ హైలైట్స్ లో ఈ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసలు ఈ పోస్టర్ ను చూస్తుంటేనే ఈ సినిమా పక్కా యాక్షన్ ప్యాక్ అర్థమవుతుంది. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త నాగ చైతన్యను ఈ సినిమాలో చూస్తారట. అయితే నాగ చైతన్యకి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ కి ఇలాంటి యాక్షన్ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నాగ చైతన్యతో రొమాన్స్ చేయడానికి కృతి శెట్టి ఎంపికైంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -