అక్కినేని నాగ చైతన్య స్పీడు పెంచేశాడు. లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చైతూ ఈ ఏడాది కూడా రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటిస్తున్న ‘కస్టడీ’ షూటింగ్ ని చివరి దశకి తీసుకొచ్చాడు అక్కినేని హీరో. ఈ సినిమా మొదలై రెండు నెలలవుతుంది. ప్రస్తుతం యూనిట్ లాస్ట్ షెడ్యూల్ లోకి ఎంటరయ్యారు.
ఈ సినిమాతో వెంకట్ ప్రభు తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కోలీవుడ్ లో శింబుతో లేటెస్ట్ గా మానాడు అనే బ్లాక్ బస్టర్ తీశాడు. ఆ సినిమా తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. థాంక్యూ తో డిజాస్టర్ అందుకున్న చైతూ ఈ సినిమాతో ఎలాగైనా ఓ సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.
ఏదేమైనా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎలాంటి బ్రేకులు లేకుండా చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తూ ఏడాదికి రెండు సినిమాలు డెలివరీ చేసే ఆలోచనలో ఉన్నాడు చైతు.
ఇవి కూడా చదవండి…