ఇదేం ట్విస్టురా..!

235
Nagachaitanya at Rana show
Nagachaitanya at Rana show
- Advertisement -

బాహుబ‌లి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు బుల్లి తెర‌పైన సంద‌డి చేస్తున్నాడు.. కాఫీ విత్ కరణ్ తరహాలో నెం 1 యారి టీవీ షో ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. ఇరుకున పెట్టే ప్రశ్నలతో చుక్కలు చూపిస్తున్నాడు.. ఇటీవ‌లే బాహుబలి దర్శకుడు, నిర్మాతలు రాజమౌళి, శోభు యార్లగడ్డలు పాల్గోన్నారు. తాజాగా ఈ షోలో న‌టులు సుమంత్, నాగచైతన్య కలిసి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఓ అభిమాని చైతూని ఓ ప్రశ్న అడిగాడు.. ఏంటంటే.. ”మీరు హైదరాబాద్‌లో మంచి బైక్ రేసర్ అని విన్నాను. చాలాసార్లు యూట్యూబ్‌లో కూడా చూశాను. మరి పెళ్లి తర్వాత సమంత ఎప్పుడైనా సీరియస్‌గా నీకు నేను ముఖ్యమా.. బైకులు ముఖ్యమా అని అడిగితే ఏం సమాధానం చెబుతావు” అంటూచైతూను అడిగాడు. దీనికి తల పట్టుకుంటూ ఇదేం ట్విస్టురా బాబూ అంటూ నవ్వేశాడు చైతూ. చైతూతో కలిసి ఈ షోకు హాజరైన సుమంత్ జోక్యం చేసుకుని.. భలే ప్రశ్న అడిగాడు అన్నాడు.

ఇక రానా ఊరుకుంటాడా… సమంత రేప్పొద్దున బైకులు వద్దు పాడు వద్దు.. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్.. అంటే ఏం చేస్తావ్ అని చైతూను గట్టిగా అడిగాడు. ”నువ్వే ఇంపార్టెంట్ అని సామ్‌కు చెబుతాను. కానీ ఇంటి బయటకు వెళ్లిన తర్వాత బైకే ఇంపార్టెంట్ అని బైక్ తీస్తాను” అంటూ గట్టిగా చైతూ నవ్వేశాడు. చైతూ ఇలా చెబుతాడని తనకు ముందే తెలుసని సుమంత్ అంటే.. ఓరి దుర్మార్గుడా అంటూ ఆశ్చర్యపోయాడు రానా. అయితే రానా, నాగ చైతన్యలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్లే.. రానా, నాగచైతన్యలు బావ బామ్మర్దులు.

https://youtu.be/VkYTE-k4rlc

- Advertisement -