ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్!

3
- Advertisement -

అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’, వీరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ సంచలనం సృష్టించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, జాతీయ స్థాయిలో ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీంతో పాన్-ఇండియా రంగంలో ఓ కొత్త శక్తిగా ‘నాగబంధం’ అవతరించిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇంకా రెండో చిత్రానికే దర్శకుడిగా అభిషేక్ నామా ప్రపంచ స్థాయి విజువల్ స్పెక్టకల్‌కు శ్రీకారం చుట్టడం విశేషం. వీరాట్ కర్ణతో పాటు డెబ్యూ నిర్మాతలు కిషోర్ అన్నపూరెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ భారీ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచారు. పెద్ద బ్యానర్లు మాత్రమే భారీ సినిమాలు తీయగలవన్న భావనను ఈ చిత్రం చెరిపేసిందని చెప్పవచ్చు.

హై-రిస్క్, హై-రివార్డ్ విజన్‌తో ముందుకెళ్లిన ఈ బృందం కృషి టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక ఫాంటసీ కథనాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో ప్రపంచ నిర్మాణం (వరల్డ్ బిల్డింగ్) మెటిక్యులస్‌గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా వీరాట్ కర్ణ రూపాంతరం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. తన పాత ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుని, పరమేశ్వరుడి అవతారాన్ని తలపించే రౌద్రరూపంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

సాంకేతికంగా కూడా ‘నాగబంధం’ కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా కనిపిస్తోంది. అద్భుతమైన, సహజత్వం కలిగిన విజువల్ ఎఫెక్ట్స్, వైభవమైన నిర్మాణ విలువలు, ఆకర్షణీయమైన సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథకు అవసరమైన భవ్యత్వాన్ని తెరపై ఆవిష్కరించడంలో నిర్మాతలు ఎలాంటి రాజీ పడలేదని స్పష్టమవుతోంది.

Also Read:అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధికారంలోకి!

- Advertisement -