ఏపీ మంత్రి రోజా, జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోందనే చెప్పాలి. నువ్వా… నేనా అన్న రీతిలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఒంటి కాలితో లేస్తున్న రోజా ఆయన టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా మెగా బ్రదర్స్ పై కూడా కామెంట్స్ చేశారు. ముగ్గురు అన్నదమ్ములు గెలవలేకపోయారని.. వాళ్లను ప్రజలు విశ్వసించలేదంటూ కౌంటర్ వేశారు. రోజా వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు తీవ్రంగా స్పందించారు.
రోజా తన బాధ్యత మర్చిపోయి పిచ్చి కూతలు కూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా తన బాధ్యత మరిచి ఇలాగే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు నాగబాబు. ఏపీలో పర్యాటక శాఖామంత్రిగా ఉన్న రోజా ఆ శాఖను పూర్తిగా విస్మరిస్తూ.. ఆ శాఖ పరువును దిగజారుస్తున్నారని.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్ లు ఉన్నాయని, ఆంధ్ర ప్రదేశ్ 18వ స్థానంలో ఉందని, రోజా ఇలాగే బాధ్యతను మరిచిపోయి నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం త్వరలోనే 20వ స్థానానికి పడిపోవడం ఖాయమంటూ నాగబాబు విమర్శించారు.
ఏపీ పర్యాటక శాఖపై ఆదారపడి కొన్ని వేల మంది జీవిస్తున్నారని, వారందరికి ఉపాధి లేకుండా పోయిందని, రోజా ఇవేమి పట్టించుకోకుండా అనవసర విషయాల్లో తలదూరుస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు.. పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో తెలుసుకో. నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను నోటికొచ్చినట్టుగా వాగినా తామేమి రియాక్ట్ కాలేదని, ఎందుకంటే రోజా నోరు చెత్తకుప్పలాంటిదని, చెత్తకుప్పను గెలకొద్దు అన్న ఉద్దేశ్యంతోనే తాము మౌనంగా ఉన్నామని నాగబాబు అన్నారు. ఇప్పటికైనా రోజా తన పద్దతి మార్చుకోవాలని నాగబాబు హితువు పలికారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్, బీజేపీల నీచరాజకీయం..
బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం
చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్