పబ్‌లో పట్టుబడ్డ నిహారిక.. నాగబాబు స్పందన..

154
nagababu
- Advertisement -

గత రాత్రి బంజారాహిల్స్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్​లో ఫుడింగ్ మింక్ పబ్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో సినీ,రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక కూడా ఉండడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నాగబాబు కోరారు.

పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. నిర్ణీత సమయానికి మించి పబ్‌ నడుపుతున్నారనే.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్‌. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నాగబాబు ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.

- Advertisement -