నాగార్జున ‘ది ఘోస్ట్’ నుండి క్రేజీ అప్‌డేట్‌..

106
- Advertisement -

కింగ్‌ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే మూవీలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ కీలక సన్నివేశాల్ని, యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించాడు దర్శకుడు.

ఈ క్రమంలో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. తదుపరి షెడ్యూల్‌ను ఊటీలో ప్లాన్ చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు మేకర్స్. ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నాగ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాదే చిత్రం విడుదల కానుంది.

- Advertisement -