గరికపాటికి నాగబాబు కౌంటర్

71
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అని పరోక్షంగా గరికపాటిని ఉద్దేశించి ట్వీట్ చేయగా ఇది వైరల్‌గా మారింది.

గవర్నర్ బండారు దత్తాత్రేయ దసరా సందర్భంగా ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఇంకా కొంతమంది మాట్లాడాల్సి ఉండగా చిరంజీవితో ఫోటోలు దిగడానికి అక్కడున్నవారు ఎగబడ్డారు. చిరంజీవి కూడా కాదనలేక అడిగిన వారందరికీ ఫోటోలు ఇచ్చారు. దీంతో గరికపాటి వేదికపైనే మెగాస్టార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -