Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

12
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ … నాగబాబు పేరును కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా నాగబాబుకు పదవులపై అనేక ఊహగానాలు వస్తుండడంతో వాటికి తెరదించుతూ జనసేన నాగబాబును ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పేరును ప్రతిపాదించింది.

ఇప్పటికే మంత్రిగా నాగబాబు పేరును చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నాగబాబును రాజ్యసభ్యకు పంపుతారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుంటారని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడతారని ప్రచారం జరుగగా అందుకు తగ్గట్టుగానే నాగబాబును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

Also Read:ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం!

- Advertisement -