తమ్ముడు బ్రహ్మాజీకి మీ అందరి సపోర్ట్‌ కావాలి- హీరో నాగశౌర్య

389
Naga Shourya
- Advertisement -

యంగ్‌ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్‌ చేసే హీలేరియస్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్‌.

ఈ సందర్భంగా ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను హీరో నాగశౌర్య షేర్‌ చేశారు. ఈ వర్కింగ్‌ స్టిల్‌ బట్టి ఈ సినిమాలో హీలేరియస్‌ సీన్స్‌ అద్భుతంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయని, ముఖ్యంగా నాగశౌర్య, బ్రహ్మాజీల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను షేర్‌ చేస్తూ బ్రహ్మాజీని నాగౌశర్య తమ్ముడు అని సంభోదించడం ఈ సినిమాలోని వినోదం ఎంత హిలేరియస్‌ అర్థం చేసుకోవచ్చు. ‘‘ నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి కావాలి. దయచేసి కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించండి’’ అని ట్వీట్‌ చేశారు నాగశౌర్య.

తన గత సినిమాలో ఎప్పుడు చేయని ఓ ప్రత్యేకమైన హీరో క్యారెక్టర్‌లో ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు నాగశౌర్య. ఆయ‌న‌ క్యారెక్టర్‌ ఆసక్తికరంగా ఉండ‌బోతుంది. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా షీర్లే సేతియా న‌టిస్తోంది. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, ఇప్పటి ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు రాధిక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సర్‌ప్రైజింగ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు టైటిల్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వెన్నెల కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయగ్రాహకులు.

నటీనటులు: నాగశౌర్య, షీర్లే సేతియా, రాధిక, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదితరులు…
సాంకేతిక విభాగం
దర్శకుడు: అనీష్‌ కృష్ణ
ప్రొడ్యూసర్‌: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి
బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌
డీఓపీ: సాయిశ్రీరామ్‌
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్‌: తమ్మిరాజు
ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌
డిజిటల్‌ హెడ్‌: ఎమ్‌ఎన్‌ఎస్‌ గౌతమ్‌
పీఆర్‌ఓ: వంశీ–శేఖర్‌

- Advertisement -