ప్రస్తుతం ఛలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో నాగశౌర్య తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి సారించాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో సుందర్ సూర్య దర్శకత్వంలో అమ్మమ్మ గారిల్లు అనే చిత్రం చేస్తున్నాడు. షామిలీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
తాజగా నర్తనశాలతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ @నర్తనశాల పేరుతో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్యకు జోడీగా ‘కిరాక్ పార్టీ’తో తెలుగు తెరకు పరిచయమవుతోన్న హిందీ సీరియల్ బ్యూటీ సిమ్రాన్ పరీంజా నటించనుందని సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆడిషన్స్‌లో సిమ్రాన్ యాక్టింగ్ పట్ల సంతృప్తిగా ఉందట చిత్రయూనిట్. అంతేగాదు నాగశౌర్య, సిమ్రాన్ జోడీ ఫ్రెష్ గా ఉంటుందని దర్శకుడు కూడా భావిస్తున్నాడట.
ఉగాది సందర్భంగా ఈ మూవీ లోగో విడుదల చేశారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్లో పాత నర్తనశాల మూవీ పోస్టర్‌తో లోగో పోస్టర్ అదిరింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.