నాగశౌర్య… ‘ఛలో’ సాంగ్ రిలీజ్‌

228
Naga Shourya Chalo song release
- Advertisement -

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”,” జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. ఈ ఎనర్జిటిక్ హీరో త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఛలో చిత్రంలోని చూసి చూడంగానే అనే సాంగ్ ను లాంచ్ చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.  మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతమందించారు.

Naga Shourya Chalo song release
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ఫస్ట్ సాంగ్ లాంచ్ కార్యక్రమం రిసెప్షన్ ఫంక్షన్ లా అనిపిస్తోంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ చాలా థాంక్స్. చూసి చూడంగానే అనే  ఈ సాంగ్ ని మహతి స్వర సాగర్ కంపోజ్ చేశారు. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ. భాస్కర భట్ల గారు సాహిత్యం అందించారు. నాగశౌర్య, రష్మిక మండన్న ఈ సాంగ్ లో చాలా అందంగా కనిపిస్తారు. ఈ పాటకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. యూట్యూబ్ లో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే పాజిటివ్ కామెంట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. గుంటూరు ఏసి కాలేజ్ లో ఈ సాంగ్ షూట్ చేసాం. డీ మానటేషన్ టైంలో అసలు ఇండస్ట్రీలో సినిమాలే తీయరని చాలా భయపెట్టారు. డిప్రెషన్ లోకి వెళ్లాను. కానీ నేను అదే టైంలో ఛలో కథ చెప్పాను. నా కథ నచ్చి ఎన్ని సమస్యలున్నా ఈసినిమా చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్న నిర్మాతలకు నేను రుణపడి ఉంటాను. అడిగిన దానికంటే చాలా ఎక్కువగా ఇచ్చారు. చాలా హ్యాపీ.  అని అన్నారు.

కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ… నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందరికీ చాలా థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకు బ్యాక్ బోన్ కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు. ఆయన లేకుంటే ఈ సినిమా చేయకూడదు అనుకున్నాం. మేము అంతగా నమ్మాం. మమ్మల్నిచాలా బాగా చూపించారు. హీరోయిన్ కిరిక్ పార్టీలో నటించిన రష్మిక మండన్న చాలా బాగా చేసింది. చూసి చూడంగానే సాంగ్  మణిశర్మ గారి తనయుడు. మహతి స్వర సాగర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. మణిశర్మ గారికి మ్యూజిక్ బ్రహ్మ అనిపేరు ఉంది. నేను మాత్రం మహతిని మ్యూజిక్ ప్రిన్స్ గా పిలుస్తున్నాను. ఇక మా ప్రొడ్యూసర్స్ మమ్మీ డాడీ. చిన్నప్పటి నుంచి ఏమీ అడక్కుండానే చేశారు. సినిమా తీయమని నేను అడగలేదు. ముఖ్యంగా అమ్మ. తర్వాత నాన్న.  ఇప్పుడు కూడా అడక్కుండానే సినిమా చేస్తున్నారు. నేను నమ్మిన స్క్రిప్ట్ నే నమ్మారు. చాలా థాంక్స్ అమ్మా, నాన్న. మా డైరెక్టర్, మా బ్రదర్ అండ్ సాయి శ్రీ రామ్ గారు.

చిత్ర సమర్పకుడు… శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ…. సినిమా సాంగ్ గురించి సినిమా గురించి నేను ఏం చెప్పను.  ఐరా క్రియేషన్స్ సంస్థ ను ఇంతగా ఆదరిస్తున్నారంటే కారణం… మీడియానే. ప్రతీ చిన్న విషయాన్ని ప్రేక్షకులకు చేరవేస్తున్నందుకు రుణపడి ఉంటాను. చాలా చాలా థాంక్స్ అని అన్నారు.

- Advertisement -