ఫిబ్రవరి 2న నాగశౌర్య ‘ఛలో’ రిలీజ్..

266
- Advertisement -

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి 2018, ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Naga Shourya Chalo Release Date

దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లారు. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తో ఈ విషయం అర్థమై ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉంటుంది. తన కెరీర్లో పర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరోయిన్ రష్మిక మండన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు అన్ని విధాల సహకరించి… ఇంత మంచి సినిమా తీసేందుకు దోహదపడ్డ మా నిర్మాతలకు నేను రుణపడి ఉంటాను. నేను ఎలాంటి టెన్షన్ పడకుండా సినిమాకు ఏం కావాలో అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించారు. ఫిబ్రవరి 2న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.

కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ… నన్ను మొదటి నుంచి అమితంగా ఆదరిస్తున్న మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరికీ చాలా థాంక్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ మా కెమెరామెన్ సాయి శ్రీరామ్. ఆయన లేకుంటే ఈ సినిమా చేయకూడదు అనుకున్నాం. మేము అంతగా నమ్మాం. మమ్మల్నిచాలా బాగా చూపించారు. హీరోయిన్ రష్మిక మండన్న చాలా బాగా చేసింది. మహతి స్వర సాగర్ అద్భుతంగా పాటల్ని కంపోజ్ చేశారు. రీ రికార్డింగ్ కూడా అదే రేంజ్ లో ఇస్తున్నారు. మా దర్శకుడు వెంకీ… చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. తాను ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవ్వడం ఖాయం. చాలా రోజులుగా నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నానో అలాంటి మంచి కమర్షియల్ సినిమా చేశాడు. అన్ని వర్గాల్ని మెప్పించే ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించిన చిత్రం ఇది. మా సొంత బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 2, 2018న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్ణయించాం. త్వరలోనే ‘ఛలో’ చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. అని అన్నారు.

Naga Shourya Chalo Release Date

చిత్ర సమర్పకుడు… శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ…. మా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మించిన ఛలో చిత్రాన్ని ఫిబ్రవరి 2, 2018న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే చిత్రంగా ఛలో నిలుస్తుందని నమ్ముతున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు.

నటీనటులు – నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు.సాంకేతిక నిపుణులు- పాటలు – భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్,డ్యాన్స్ – రఘు, విజయ్,పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను,పబ్లిసిటీ డిజైన్స్ – అనిల్ భాను,ఫైట్స్ – వెంకట్,ఆర్ట్ – రామ్ అరసవిల్లి,లైన్ ప్రొడ్యూసర్ – బుజ్జి,ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు,సంగీతం- మహతి స్వర సాగర్ ,సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌,నిర్మాత‌- ఉషా ముల్పూరి,సమర్పణ – శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి, ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌.

- Advertisement -