ఈ యంగ్ హీరోని గుర్తుపట్టారా..!

409
naga shourya

కొంతకాలంగా సరైన హిట్ లేక ఢీలా పడ్డ యంగ్ హీరో నాగశౌర్య..తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఆచితూచి అడుగువేస్తున్నాడు. తాజాగా రమణతేజ దర్శకత్వంలో అశ్వత్థామ అనే మూవీ చేస్తుండగా ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు శౌర్య. అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనుండగా అందుకు తగ్గట్టుగానే తన రూపాన్ని మార్చుకున్నాడు.

ఇప్పటివరకు ఫ్యామిలీ మూవీస్ చేసి సాఫ్ట్ బాయ్‌ల మెప్పించిన నాగశౌర్య ఒక్కసారిగా రాంబోలా మారిపోయాడు. సోషల్ మీడియాలో శౌర్య చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. కండలు తిరిగన బాడీతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో అందరిని మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ ఫోటోకు ఏది రైటో అదే చేయండి, ఈజీగా ఉండేది కాదు అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

ఈ మూవీలో నాగశౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతుడగా పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, విజ‌య‌ ప్రకాష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛ‌లో,నర్తనశాల తర్వాత సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్ లో నాగశౌర్య చేస్తోన్న సినిమా ఇది.

NagaShaurya’s electrifying body transformation stuns fans, Shaurya looks muscular and massy for #Aswathama