ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికల పోలింగ్..

511
karnataka by elections

కర్ణాటక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పడిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా రెండు స్ధానాల్లో కోర్టులో కేసులు ఉండటంతో 15 స్ధానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. బరిలో ఉన్న అభ్యర్థులు సైతం ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తికనబర్చారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుండగా ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు యడియూరప్ప సర్కార్‌కు కీలకం కానున్నాయి.