‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్‌కు గెస్టులుగా స్టార్ హీరోలు..

151
- Advertisement -

టాలీవుడ్‌ పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ సినిమా మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటోంది. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయతీ’ ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనూష్ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు,ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ .. దసపల్లా హోటల్లో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా కింగ్ నాగార్జున .. న్యాచురల్‌ స్టార్‌ నాని వస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్‌. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

- Advertisement -