నెగెటివ్‌ పాత్రలో నాగచైతన్య..!

119
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు ఈ యంగ్ హీరో ఓటీటీలో కూడా అడుగుపెడుతున్నాడు. ఓ హారర్‌ కథతో రూపొందనున్న సిరీస్‌లో చైతూ నటించనున్నాడు. ఇందులో ఆయన నెగెటివ్‌ షేడున్న పాత్రలో కనిపించనున్నాడు. దీనిపై చైతూ స్పందిస్తూ ‘‘అమెజాన్‌ ప్రైమ్‌లో కోసం చేస్తున్న ఈ సిరీస్‌కు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

నేను నెగెటివ్‌ షేడున్న పాత్ర చేయడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. హారర్‌ నేపథ్యంలో సవాల్‌ విసిరే పాత్ర ఇది. అందుకే ట్రై చేస్తున్నా. ఎప్పుడూ చేయని పాత్ర చేయడం కాస్త కొత్తగానే ఉంటుంది. కరోనాకి ముందు ప్రారంభం కావలసిన సిరీస్‌ ఇది. డిసెంబర్‌లో మొదలుపెడుతున్నాం’’ అని చైతూ తెలిపారు.

- Advertisement -